: ఫేస్ బుక్ లో సత్తా చాటిన మోదీ... ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ హీరో!


ఇప్పటికే సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ లో అత్యధిక ఫాలోవర్లతో దూసుకెళుతున్న ప్రధాని నరేంద్ర మోదీ, మరో సామాజిక మాధ్యమం ఇన్ స్టాగ్రామ్ లోనూ హీరోగా నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా ఇన్ స్టాగ్రామ్ వాడుతున్న రాజకీయ నాయకుల్లో ఎవరికీ లేనంతమంది ఫాలోవర్లు ఆయన్ను అనుసరిస్తున్నారని ఇన్ స్టాగ్రామ్ వెల్లడించింది. ఆయన్ను ఫాలో అవుతున్న వారి సంఖ్య 68,03,576 దాటిందని, మరే రాజకీయ నేతకూ ఇంతమంది ఫాలోవర్లు లేరని సంస్థ పేర్కొంది.

కాగా, ఇప్పటివరకూ ఇన్ స్టాగ్రామ్ లో మోదీ 101 పోస్టులను మాత్రమే పెట్టడం గమనార్హం. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విభాగంలో 63,76,699 అనుచరులతో రెండో స్థానంలో నిలిచారు. పోప్ ఫ్రాన్సిస్ కు 37,26,568 మంది, వైట్ హౌస్ కు 34,75,675 మంది, ఇండోనేషియా రాజకీయ నాయకుడు జోకో విడోడోకు 34,70,165 మంది, జోర్డాన్ రాణి క్వీన్ రానియాకు 30,68,291 మంది ఫాలోవర్లు ఉన్నారని ఇన్ స్టాగ్రామ్ పేర్కొంది.

  • Loading...

More Telugu News