: టీ20లకు ధోనీ సరిపోడేమో!: గంగూలీ


టీమిండియా మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ20ల్లో ధోనీ ప్రదర్శన అంత గొప్పగా ఏమీ లేదని అభిప్రాయపడ్డాడు. పొట్టి క్రికెట్లో ధోనీని మెరుగైన ఆటగాడిగా తాను భావించడం లేదని చెప్పాడు. వన్డేల్లో ధోనీ అత్యున్నత ఆటగాడు అనడంలో సందేహం లేదని తెలిపాడు. అయితే, గత పదేళ్ల కాలంలో టీ20ల్లో ధోనీ కేవలం ఒకే ఒక అర్ధ శతకం సాధించాడని చెప్పాడు. ఇదేమంత చెప్పుకోదగ్గ విషయం కాదని అన్నాడు. ఈ ఐపీఎల్ లో ఆడిన మూడు మ్యాచుల్లోనూ ధోనీ విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలోనే, గంగూలీ ఈ వ్యాఖ్యలు చేశాడు. 

  • Loading...

More Telugu News