: దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల ఫలితాల సరళి... కొనసాగిన బీజేపీ హవా


8 రాష్ట్రాల్లోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ తన హవాను కొనసాగిస్తుండగా, కర్ణాటకలో మాత్రం కాంగ్రెస్ తన ఉనికిని కాపాడుకునే దిశగా సాగుతున్నట్టు ట్రెండ్స్ చెబుతున్నాయి. ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం, హిమాచల్ ప్రదేశ్ లోని భోరంజ్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. న్యూఢిల్లీ పరిధిలోని రాజౌరీ గార్డెన్స్ అసెంబ్లీ సెగ్మెంట్ లో బీజేపీ అభ్యర్థి ముందున్నాడు. ఇక్కడ ఆప్ తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయేలా ఉంది. ఝార్ఖండ్ పరిధిలోని లితిపార నియోజకవర్గంలో జేఎంఎం అభ్యర్థి ముందంజలో ఉండగా, కర్ణాటకలోని నంజనగూడు, గుండ్లుపేటె నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. రాజస్థాన్ లోని ధోల్ పూర్ అసెంబ్లీ సెగ్మెంట్ లోనూ బీజేపీ ముందంజలో ఉంది.

  • Loading...

More Telugu News