: ఢిల్లీ డగౌట్ లో తొలిసారి దర్శనమిచ్చిన జహీర్ ఖాన్ ప్రేయసి
టీమిండియా మాజీ పేసర్, ఐపీఎల్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు కెప్టెన్ జహీర్ ఖాన్ 'ఛక్ దే ఇండియా'లో నటించిన సాగరిక ఘాట్గేతో ప్రేమలో ఉన్నాడంటూ పుకార్లు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వివిధ ఫంక్షన్లలో వారిద్దరూ కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేయడం తప్ప వాళ్లిద్దరూ పెద్దగా కనిపించిన సందర్భాలు లేవు. అయితే ఈ డేటింగ్ వార్తలను నిజం చేస్తూ వారిద్దరూ ఐపీఎల్ లో పూణేతో జరిగిన మ్యాచ్ లో సందడి చేశారు. సాగరిక ఘాట్గే ఏకంగా ఢిల్లీ డగౌట్ లో కనిపించింది. ఢిల్లీ జెర్సీ ధరించిన సాగరిక ప్రియుడు జహీర్ తో నవ్వుతూ, తుళ్లుతూ కనిపించింది. ఈ మ్యాచ్ లో పూణేను జహీర్ సేన 97 పరుగులు భారీ ఆధిక్యంతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.