: అనంతపురం జిల్లా కదిరిలో దారుణం...ఇంటర్ యువతిని కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం


అనంతపురం జిల్లా గుత్తిలో జరిగిన సామూహిక అత్యాచారం ఘటన మర్చిపోకముందే... అదే జిల్లా కదిరిలో మరో సామూహిక అత్యాచారం ఘటన వెలుగుచూసింది. గుత్తి ఘటనలో శ్రీరామ నవమి రోజు గుడికి వెళ్లి వస్తున్న బాలికను అపహరించగా, కదిరి ఘటనలో కళాశాలకు వెళ్లి వస్తున్న ఇంటర్ విద్యార్థినిని అపహరించిన దుండగులు ఐదుగురు వారంరోజులపాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు వారి నుంచి తప్పించుకుని ఇంటికి చేరి, తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, పరారీలో ఉన్న ముగ్గురి కోసం వెతుకులాట ప్రారంభించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 

  • Loading...

More Telugu News