: కుల్ భూషన్ జాదవ్ ను పాకిస్థాన్ పట్టుకోలేదా? మరి ఆయన పాక్ చేతికి ఎలా చిక్కారు?: పాకిస్థాన్ పత్రిక కథనం


భారత్ నేవీ అధికారి కుల్ భూషణ్ జాదవ్‌ పాకిస్థాన్‌ అధికారులకు పట్టుబడలేదా? అలాంటప్పుడు ఆయన పాకిస్థాన్ కు ఎలా దొరికారన్న దానిపై పాకిస్థాన్ ప్రముఖ పత్రిక డాన్ ప్రత్యేక కథనం ప్రచురించింది. ఆ వివరాల్లోకి వెళ్తే... వ్యాపారం నిమిత్తం ఇరాన్‌ వెళ్లిన కుల్ భూషణ్ జాదవ్‌ ను ఇరాన్‌ స్వాధీనంలో ఉన్న బలూచిస్థాన్‌ ప్రాంతంలోని తాలిబన్లు అపహరించారు. అనంతరం వారు ఆయనను పాక్‌ నిఘా అధికారుల (ఐఎస్ఐ)కు విక్రయించారు. దీంతో పాకిస్థాన్ కుల్ భూషణ్ జాదవ్ ను బెలూచిస్థాన్ లో గూఢచర్యం చేస్తుండగా పట్టుకున్నట్టు గప్పాలు కొట్టుకుని, ఉరిశిక్ష విధించింది.

అందుకే సహేతుకమైన వాదన లేకుండా ఆయనకు ఉరిశిక్ష విధించింది. ఈ వాదనను పాకిస్థాన్‌ లో జర్మనీ దౌత్యవేత్తగా పనిచేసిన ములాక్‌ నిర్ధారించినట్లు డాన్‌ పత్రిక ప్రత్యేక కథనం ప్రచురించింది. ఇరాన్‌ భూభాగంలో ఉన్న తాలిబన్‌ స్మగ్లర్ల మాఫియా జాదవ్‌ ను కిడ్నాప్‌ చేసిందని ఆఫ్ఘానిస్తాన్‌ పాత్రికేయుడు మాలిక్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో గత ఏడాది ఏప్రిల్ 2న ఆయన ట్వీట్ చేశారు. ఈ లెక్కన కుల్ భూషణ్ జాదవ్ ను పాకిస్థాన్ పట్టుకోలేదు. కానీ అతనిని పట్టుకున్న క్రెడిట్ మాత్రం తన ఖాతాలో వేసుకుంటోంది. 

  • Loading...

More Telugu News