: వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఒంటరిగా పోటీ చేస్తాం!: బీజేపీ నేత మురళీధర్ రావు
వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఒంటరిగా పోటీ చేస్తామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు వెల్లడించారు. చిత్తూరు జిల్లా ములకలచెరువులో ఈ రోజు రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ బూత్ స్థాయి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ఏపీలో రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లోను తమ పార్టీ సొంతంగా పోటీ చేస్తుందని పేర్కొన్నారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో బీజేపీ పుంజుకుంటోందని చెప్పిన ఆయన, ఏపీతో పాటు కర్ణాటకలో కూడా పార్టీ బలోపేతానికి ప్రధాని మోదీ చర్యలు తీసుకుంటున్నారని అన్నారు.