: ‘బాహుబలి-2’ ఐమ్యాక్స్ పోస్టర్ అదుర్స్!


‘బాహుబలి-2’ చిత్రాన్ని రెగ్యులర్ వెర్షన్ తో పాటు ఐ మ్యాక్స్ వెర్షన్ లోనూ విడుదల చేస్తామని చిత్ర బృందం గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ‘బాహుబలి-2’ ఐ మ్యాక్స్ పోస్టర్ ను ఈ రోజు ముంబయిలో విడుదల చేశారు. ఈ పోస్టర్ ను చిత్ర బృందం తన ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకుంది. ఈ కార్యక్రమంలో దర్శకుడు రాజమౌళి, సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాగా, ఈ నెల 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో హీరో ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, అనుష్క, నాజర్, సత్యరాజ్ తదితరులు నటించారు.

  • Loading...

More Telugu News