: ఎవరు తిట్టినా బాధపడను.. వారిని క్షమించాలని భగవంతుడ్ని ప్రార్థిస్తా: మమతా బెనర్జీ
తనను ఎవరు తిట్టినా బాధపడనని, వారిని భగవంతుడు క్షమించాలని ప్రార్థిస్తానని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ముర్షిదాబాద్ జిల్లా డోమ్ కల్ లో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. తన తల నరికి తెచ్చిన వారికి రివార్డు ఇస్తానన్న బీజేవైఎం నేత యోగేశ్ వార్ష్నీచేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ, తనపై ఇలాంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలను నిత్యం ఎవరో ఒకరు చేస్తుంటారని, ఆ వ్యాఖ్యలతో తాను మరింత అభివృద్ధి చెందుతున్నానని అన్నారు.
కాగా, బీర్భమ్ జిల్లాలో హనుమాన్ జయంతి సందర్భంగా నిన్న జరిగిన ర్యాలీలో ప్రజలకు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటుచేసుకున్న నేపథ్యంలో మమతపై వార్ష్నీచేసిన ఘాటు వ్యాఖ్యలకు ఆమె తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ‘నేను దుర్గ పూజల్లో పాల్గొంటా. మసీదుకూ వెళ్తా. చర్చిలో ప్రార్థనలు చేస్తా. ఆపడానికి మీరెవరు?’ అని ప్రశ్నిస్తూ మమతా ఘాట్ ట్వీట్ చేశారు.