: ఛాంపియన్స్ ట్రోఫీ-2017 అంబాసిడర్లలో హర్భజన్ సింగ్
ఈ ఏడాది జూన్ 1 నుంచి 18 వరకు ఇంగ్లండ్ లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ-2017కు గానూ అంబాసిడర్ల పేర్లను ఐసీసీ ప్రకటించింది. భారత్ నుంచి హర్భజన్ సింగ్, ఆస్ట్రేలియా నుంచి మైక్ హస్సీ, న్యూజిలాండ్ నుంచి షేన్ బాండ్, శ్రీలంక నుంచి కుమార సంగక్కర, ఇంగ్లండ్ నుంచి ఇయన్ బెల్, దక్షిణాఫ్రికా నుంచి గ్రేమ్ స్మిత్, పాకిస్థాన్ నుంచి షాహిద్ అఫ్రీది, బంగ్లాదేశ్ నుంచి హబిబుల్ బషర్లను అబాసిడర్లుగా ఎంపిక చేసినట్లు తెలిపింది. తనను అంబాసిడర్‌గా నియమించడం పట్ల హర్భజన్ సింగ్ హర్షం వ్యక్తం చేశాడు. తాను అంబాసిడర్‌గా నియమించబడటాన్ని గౌరవంగా భావిస్తున్నానని అన్నాడు. టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోందని అన్నాడు.