: ఇదో రకం స్నానం... తేనెటీగలతో ఒళ్లు రుద్దుకొని తలంటు స్నానం చేసిన వ్యక్తి!
తేనెపట్టు కనిపిస్తేనే దానికి దూరంగా పరుగులు తీస్తాం. ఒక్క తేనెటేగ మనవైపు వస్తుందంటే వణికిపోతాం. అయితే, ఓ వ్యక్తి తేనెటీగలతో తలంటు స్నానం చేశాడంటే నమ్ముతారా? సదరు వ్యక్తి ఈ సాహసం చేస్తుండగా తీసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తన ఇంటిపై ఉన్న ఓ పెద్ద తేనెపట్టు వద్దకు చేరుకొని, తేనెటీగలను తన చేతిలో పట్టుకుని, సబ్బుతో రుద్దుకున్నట్లు ఒళ్లంతా రుద్దుకున్నాడు. తన వంటిపై ఏదైనా మందు రాసుకొని చేశాడో.. ఒట్టి వంటితోనే ఇలా చేశాడో కానీ... తేనెటీగలు ఆయనను కుడుతుంటే ఆయనకు మాత్రం ఏమీ కాలేదు. మీరూ ఈ వీడియోను చూడండి.