: సరబ్ జిత్ హంతకులను కచ్చితంగా శిక్షిస్తాం: పాక్


లాహోర్లోని కోట్ లఖ్ పత్ జైలులో భారత ఖైదీ సరబ్ జిత్ సింగ్ పై దాడి చేసిన వారిని కచ్చితంగా శిక్షిస్తామని పాక్ లోని పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నజమ్ సేథీ తెలిపారు. ఈ ఘటనపై జ్యుడీషియల్ విచారణ జరిపిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. మరోవైపు సరబ్ మృతదేహాన్ని పాక్ భారత అధికారులకు అప్పగించింది. అక్కడి భారత హై కమిషన్ కు చెందిన ఇద్దరు అధికారులు సరబ్ భౌతికకాయాన్ని ప్రత్యేక విమానంలో అమృత్ సర్ తీసుకువచ్చారు. ఆయన మృతదేహాన్ని నేరుగా స్వగ్రామమైన పంజాబ్ లోని భీకీవింద్ కు తరలిస్తారు. రేపు నిర్వహించనున్న అంత్యక్రియలకు పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ హాజరవుతారు.

  • Loading...

More Telugu News