: మా కుటుంబ విషయాలు బయటి వారికేం తెలుస్తాయి?: హీరో వరుణ్ తేజ్ ఆవేదన


మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కల్యాణ్ ల మధ్య సఖ్యత లేదనే వార్తలు చాలా కాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. ఒకరి సినిమా వేడుకలకు మరొకరు రాకపోవడం ఈ వాదనలకు మరింత బలం చేకూరుస్తోంది. ఈ విషయంపై యంగ్ హీరో వరుణ్ తేజ్ స్పందించాడు. ఇలాంటి వార్తలు విన్నప్పుడు చాలా బాధ కలుగుతుందని వరుణ్ చెప్పాడు. ప్రారంభంలో ఇలాంటి వార్తల పట్ల కలత చెందేవాడినని తెలిపాడు. 'వాస్తవానికి మా కుటుంబంలో ఏం జరుగుతుందో బయటి వారికేం తెలుస్తుంది?' అని ప్రశ్నించాడు. ఈ విషయం గురించి పదేపదే జనాలకు వివరణ ఇవ్వాల్సి రావడం చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పాడు. 

  • Loading...

More Telugu News