: అంబానీ ఇంటిని చంద్రబాబు ఇంటిగా ప్రచారం చేస్తున్నారు: వైసీపీపై టీడీపీ ఫిర్యాదు
హైదరాబాదులోని చంద్రబాబు నివాసం గురించి తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారంటూ వైసీపీ నేతలపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విజయవాడ కమిషనర్ గౌతమ్ సవాంగ్ ను కలిసి టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు వేదవ్యాస్ తో పాటు మరికొందరు నేతలు కంప్లైంట్ చేశారు. పారిశ్రామికవేత్తలైన ముఖేష్ అంబానీ, విజయ్ మాల్యాలకు చెందిన ఇళ్ల ఫోటోలను పోస్ట్ చేసి, వాటిని చంద్రబాబు ఇంటి ఫొటోలుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. చంద్రబాబు ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకే వైసీపీ నేతలు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని తెలిపారు.