: హైదరాబాద్ లో దారుణం.. పెళ్లయిన మూడు నెలలకే యువతి ఆత్మహత్య


త‌న చావుకి త‌న భర్త, అత్త, ఆడపడుచు వేధింపులే కార‌ణ‌మ‌ని తెలుపుతూ సెల్ఫీ వీడియో తీసి, అనంత‌రం ఓ వివాహిత ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న హైదరాబాద్‌లోని బాలాపూర్‌లోని మినార్‌ కాలనీలో చోటు చేసుకుంది. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వారు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. అంజుమ్‌ (20) అనే యువ‌తికి ఇర్ఫాన్ అనే వ్యక్తితో ఈ ఏడాది జనవరి 13న వివాహమైంది. అయితే, ఆమెను అత్తింటివారు అదనపు కట్నం కోసం వేధింపుల‌కు గురిచేస్తున్నారు. దీంతో అంజుమ్‌ను ఆమె తండ్రి ప‌దిరోజుల క్రితం పుట్టింటికి తీసుకొచ్చాడు. తనను తల్లిదండ్రులు క్షమించాలని కోరుతూ, త‌న చావుకి త‌న భర్త, అత్త, ఆడపడుచు వేధింపులే కార‌ణ‌మ‌ని చెబుతూ ఆమె ఓ సెల్ఫీ వీడియో తీసి, ఆ తర్వాత బాత్‌రూమ్‌లోకి వెళ్లి ఉరి వేసుకొని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది. ఆమెను గ‌మ‌నించిన కుటుంబ స‌భ్యులు ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా ఆమె అప్ప‌టికే ప్రాణాలు కోల్పోయింద‌ని వైద్యులు చెప్పారు.

  • Loading...

More Telugu News