: ప్రభాస్ కు సీక్రెట్ మెసేజ్ పెట్టిన బాలీవుడ్ భామ!
'బాహుబలి' సినిమాతో ప్రభాస్ స్టార్ ఇమేజ్ ఎవరికీ అందనంత ఎత్తుకు వెళ్లిపోయింది. హాలీవుడ్ లో సైతం ప్రభాస్ కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. దీంతో, ఈ రెబల్ స్టార్ ఇప్పుడు నేషనల్ స్టార్ గా ఎదిగాడు. ప్రభాస్ కు ఉన్న లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. కానీ, ఓ బాలీవుడ్ భామ ఇప్పుడు ప్రభాస్ కు పడిపోయిందనే వార్త హల్ చల్ చేస్తోంది.
'ధోనీ' సినిమాలో నటించిన కైరా అద్వానీ గతంలో పలుసార్లు ప్రభాస్ ను కలవడానికి యత్నించిందట. కానీ, ప్రతిసారి ఆమెకు నిరాశే ఎదురైందట. చివరకు టాలీవుడ్ లోని ఓ హీరో నుంచి ప్రభాస్ నంబర్ సంపాదించి, ఒక సీక్రెట్ మెసేజ్ పెట్టిందట. ఆ మెసేజ్ కు ప్రభాస్ రిప్లై కూడా ఇచ్చాడట. అయితే, ఆమె ఏం మెసేజ్ పెట్టిందనే విషయం మాత్రం బయటకు పొక్కలేదు. ప్రభాస్ పక్కన నటించే అవకాశం కోసమే కైరా ప్రయత్నిస్తోందంటూ కొందరు చెప్పుకుంటున్నారు.