: జియో దెబ్బకు రోడ్డున పడనున్న 10 లక్షల మంది ఉద్యోగులు... రూ. 4,900 కోట్ల నష్టం


రిలయన్స్ జియో ఫ్రీ ఆఫర్ల దెబ్బకు ఇతర టెలికాం కంపెనీలకు భారీ నష్టం వాటిల్లింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో దేశీయ టెలికాం కంపెనీల ఆదాయం ఏకంగా రూ. 4,900 కోట్లు పడిపోయింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ నష్టం మరో రూ. 4వేల కోట్ల మేర ఉంటుందని ఓ ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ అంచనా వేసింది. అంతేకాదు, జియో రాకతో దేశీయ టెలికాం రంగంలో దాదాపు 10 లక్షల మంది ఉద్యోగులు రోడ్డున పడే అవకాశం ఉందని తెలిపింది. ఖర్చులు తగ్గించుకునే క్రమంలో, ఇప్పటికే పలు కంపెనీలు అనేక మంది ఉద్యోగులను ఇంటికి పంపించేశాయని చెప్పింది. 

  • Loading...

More Telugu News