: కాంగ్రెస్ పార్టీలో విభేదాలు.. పార్టీ నిర్ణయంతో విభేదించిన వీరప్ప మొయిలీ


కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తున్నారంటూ కొన్ని పార్టీలు చేస్తున్న ఆందోళనలో కాంగ్రెస్ పార్టీ జత కలవడాన్ని ఆ పార్టీ సీనియర్ నేత వీరప్ప మొయిలీ తప్పుబట్టారు. పార్టీలో కొన్ని నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకుంటున్నారని... సీనియర్ల సలహాలను తీసుకోవడం లేదని మండిపడ్డారు.

ఎన్నికల్లో ఓడిపోయిన వారు తప్పంతా ఈవీఎంలదే అని ఆరోపించడాన్ని మొయిలీ తప్పుబట్టారు. ఓటమికి అనేక కారణాలు ఉంటాయని చెప్పారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే, మన దేశంలోనే ఎన్నికల విధానం అత్యున్నతంగా ఉందని అన్నారు. తాను న్యాయశాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే ఈవీఎంల వ్యవస్థను ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ ఘనత కాంగ్రెస్ పార్టీ, యూపీఏలకు దక్కుతుందని చెప్పారు. మళ్లీ బ్యాలెట్ పత్రాల ద్వారా పోలింగ్ కు వెళ్లే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. 

  • Loading...

More Telugu News