: బాలీవుడ్ హాట్ న్యూస్.... మాజీ ప్రియురాలితో సల్మాన్ కలిసిపోయాడా?


బాలీవుడ్ లో సరికొత్త వార్త హల్ చల్ చేస్తోంది. రణ్ బీర్ కపూర్ నుంచి విడిపోయిన కత్రినా కైఫ్ మళ్లీ సల్మాన్ ఖాన్ కు దగ్గరైందని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. రొమేనియన్ భామ లులియా వంతూర్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడని, సల్మాన్ ఇంట్లోనే లులియా ఉంటోందని, ఒక దశలో వారిద్దరూ వివాహం చేసుకున్నారని కూడా వార్తలు వచ్చాయి. వీటిపై సల్మాన్ తనదైన స్టైల్ లో నవ్వేసినా, లులియా మాత్రం వివాహం జరగలేదని తేల్చిచెప్పింది.

ఈ క్రమంలో తన చెల్లెలు వివాహం సమయంలో కత్రినాను ఉద్దేశించి, 'ఖాన్ దాన్ కు కోడల్ని చేద్దామనుకుంటే...కపూర్ వెంటపోయావంటూ' సల్మాన్ నవ్వుతూ సెటైర్ కూడా వేసిన సంగతి తెలిసిందే. విచిత్రంగా కొన్నాళ్లకు రణ్ బీర్ కపూర్ తో కత్రినా కైఫ్ కు విభేదాలు తలెత్తాయి. దీంతో కత్రినా మళ్లీ సల్మాన్ పంచన చేరింది. తాజాగా కత్రినాకు సల్మాన్ రెండు ఆఫర్లు ఇప్పించాడు. ఒకటి, గతంలో వారిద్దరూ నటించిన 'ఏక్ థా టైగర్' కు సీక్వెల్ గా రూపొందుతున్న 'టైగర్ జిందా హై' సినిమా కాగా, అమితాబ్, అమీర్ ఖాన్ తో ఆదిత్య చోప్రా రూపొందిస్తున్న 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్' సినిమాలో కూడా ఛాన్స్ ఇవ్వమని చెప్పాడట. ఇలా మళ్లీ పాత ప్రేమికులు కొత్త ప్రేమాయణం మొదలెట్టారని బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 

  • Loading...

More Telugu News