: రాజమౌళి కలే షారూఖ్ ఖాన్ కూడా కంటున్నాడు!


ప్రముఖ దర్శకుడు రాజమౌళి తన జీవితంలో మహాభారతాన్ని సమగ్రంగా తెరకెక్కించాలన్న కోరికను పలు సందర్భాల్లో వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సరిగ్గా బాలీవుడ్‌ బాద్షా షారుక్‌ ఖాన్ కూడా ఇదే కలను కంటున్నాడు. తన తదుపరి సినిమాల గురించి ఓ ఇంటర్వ్యూలో షారూఖ్ ఖాన్ మాట్లాడుతూ, మహాభారతాన్ని సినిమాగా తీయాలనుకుంటున్నాను కానీ, అంత బడ్జెట్‌ తన వద్ద లేదని అన్నాడు. సల్మాన్‌, కరణ్‌ కలిసి సినిమా నిర్మిస్తున్న రీతిలో... మహాభారతాన్ని తీయడానికి తనకు కూడా ఓ నిర్మాత తోడైతే తన కలను నెరవేర్చుకుంటానని చెప్పాడు. మహాభారతం తీయడం తన డ్రీమ్ అని షారూఖ్ తెలిపాడు. సరైన సహనిర్మాత దొరికితే తప్పకుండా ఈ చిత్రాన్ని తీస్తానని ఆయన అన్నాడు.

 అయితే ఒకవేళ మహాభారతం అంటూ తీస్తే అది కచ్చితంగా అంతర్జాతీయ మార్కెట్ల్ లో కూడా విజయం సాధించాలని అన్నాడు. అలా ఆ మార్కెట్ ను కూడా కొల్లగొట్టాలంటే అంతర్జాతీయ స్థాయి నిర్మాత అయితే సినిమాపై మరింత ఆసక్తి పెరుగుతుందని చెప్పాడు. మహాభారతాన్ని ఏదో సామాన్య సినిమాలా తీసి వదిలేయలేమని, అది 'బాహుబలి' కంటే మరింత సమర్థవంతంగా, మరింత గొప్ప విజయం సాధించేలా ఉండాలని షారూఖ్ ఆకాంక్షించాడు. కాగా, అమీర్ ఖాన్ కూడా ఒక ఆధ్యాత్మిక సినిమా చేయాలన్న ఆలోచనలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ ను ఏలుతున్న షారూఖ్, సల్మాన్, అమీర్ ఖాన్ లు కలిసి మహాభారతంను సినిమాగా రూపొందిస్తే బాగుంటుందని బాలీవుడ్ భావిస్తోంది.

  • Loading...

More Telugu News