: ‘జియో’ క్రేజ్ ను క్యాష్ చేసుకుంటున్న రైస్ మిల్లర్స్!


రిలయన్స్ ‘జియో’ ప్రవేశపెట్టిన ‘సమ్మర్ సర్ ప్రైజ్’,‘ధన్ ధనాధన్’ వంటి ఆఫర్లను వినియోగదారులు అందిపుచ్చుకుంటున్న విషయం తెలిసిందే. దీంతో, ‘జియో’పై  క్రేజ్ మరింతగా పెరిగింది. అయితే, ఈ క్రేజ్ ని తమకు అనుకూలంగా పెద్దపల్లి జిల్లా రామగుండం రైస్ మిల్లర్స్ మలచుకున్నారు. ఈ రెండు వేర్వేరు రంగాలు కాబట్టి ‘ఈ  క్రేజ్ ను రైస్ మిల్లర్స్ ఎలా క్యాష్ చేసుకుంటారనే అనుమానం ఎవరికైనా తలెత్తకమానదు.

అదెలా సాధ్యమంటే .. 25 కిలోల బియ్యపు బ్యాగ్ లపై ‘జియో’ లోగోను ముద్రిస్తున్నారు. అందులో, సన్నరకపు బియ్యాన్ని దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. కేవలం, రామగుండంలోని రైస్ మిల్లర్స్ మాత్రమే కాదు, పలు పట్టణాల్లోని ఇతర రైస్ మిల్లర్స్ కూడా ఇదే బాట పట్టారు. అయితే, ‘జియో’ లోగోతో ఉన్న బియ్యాన్ని ఏ మేరకు వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారో తెలియదు. ఇదిలా ఉండగా, ‘జియో’ లోగోతో ఉన్న ఈ బియ్యపు బస్తాల ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. దీనిపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తుండటం గమనార్హం. 

  • Loading...

More Telugu News