: సచిన్ సినిమా ట్రైలర్ ఏప్రిల్ 13న, సినిమా మే 26న విడుదల
క్రికెట్ దేవుడుగా కీర్తిప్రతిష్ఠలు సంపాదించుకున్న టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పై ‘సచిన్-ఎ బిలియన్ డ్రీమ్స్’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అభిమానులు ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా ట్రైలర్, సినిమా విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 13 సాయంత్రం 7 గంటలకు ఈ సినిమా ట్రైలర్ ను ఈ చిత్ర యూనిట్ లాంఛ్ చేయనుంది. అలాగే ఈ సినిమాను మే 26న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు కార్నివాల్ సినిమాస్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది. సచిన్ బయోపిక్ ను కార్నివాల్ సినిమాస్ నిర్మిస్తోంది. ఇప్పటికే ధోనీ బయోపిక్ సంచలన విజయం సాధించి, నిర్మాతకు భారీ ఆదాయం తెచ్చినందున... సచిన్ బయోపిక్ ఇంకెన్ని సంచలనాలకు కేంద్రమవుతుందోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.