: నీ రాజకీయ జీవితం ఇక మటాష్!: దినకరన్ పై పన్నీరు సెల్వం వర్గీయుల గరంగరం


ఆర్కేనగర్ ఉపఎన్నికలు వాయిదా పడినా శశికళ వర్గం, పన్నీరు సెల్వం వర్గం మధ్య విమర్శల దాడులు తగ్గడం లేదు. ఉపఎన్నికలను జాతీయ ఎన్నికల సంఘం వాయిదా వేయడంతో పన్నీరు సెల్వం వర్గీయులు తీవ్రస్థాయిలో దినకరన్ పై విమర్శలు కురిపిస్తున్నారు.

దీనిపై మాజీ మంత్రి, పన్నీర్ సెల్వం వర్గం నేత కేపీ మునుస్వామి మాట్లాడుతూ, అన్నాడీఎంకే అమ్మ పార్టీ డిప్యూటీ కార్యదర్శి టీటీవీ దినకరన్‌ రాజకీయ జీవితం ఇక ముగిసినట్లేనని అన్నారు. ఆర్కేనగర్‌ లో నగదు పంపిణీలో దినకరన్‌ పాత్ర ఉందని ప్రపంచమంతా కోడై కూస్తోందని ఆయన విమర్శించారు. కేవలం తన కుటుంబ సభ్యులను కాపాడుకునేందుకు ఆరుగురు మంత్రులను దినకరన్ బలిపశువులను చేశారని ఆయన మండిపడ్డారు. డీఎంకే నేతలు కూడా డబ్బులు విరజిమ్మారని వారు ఆరోపించారు. ఇలాంటి ఎన్ని కుట్రలు పన్నినా తమ అభ్యర్థి మధుసూదనన్ విజయం ఖాయమని వారు స్పష్టం చేశారు. 

  • Loading...

More Telugu News