: సురేశ్ రైనా సూపర్
చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేశ్ రైనా (100) నేడు విశ్వరూపం ప్రదర్శించాడు. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో రైనా 53 బంతుల్లోనే అజేయ సెంచరీ సాధించాడు. రైనా స్కోరులో 7 ఫోర్లు, 6 సిక్సులున్నాయి. సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్ మరో రెండు బంతుల్లో ముగుస్తుందనగా రైనా.. పంజాబ్ బౌలర్ ప్రవీణ్ కుమార్ బంతికి సింగిల్ తీసి శతకం పూర్తి చేసుకున్నాడు. రైనా వీరోచిత బ్యాటింగ్ తో చెన్నై ఈ పోరులో 4 వికెట్లకు 186 పరుగుల భారీ స్కోరును ప్రత్యర్థి ముందుంచింది. చెన్నై జట్టులో హసీ 35, అల్బీ మోర్కెల్ 23 పరుగులు చేశారు.