: నేను సామాన్యుడిని.. రైల్లోనే తిరిగి ముంబయికి వెళ్తా!: శివసేన ఎంపీ గైక్వాడ్


ఎయిర్ ఇండియా సిబ్బందితో అవమానకర రీతిలో ప్రవర్తించిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ పై సదరు విమానయాన సంస్థ నిషేధం విధించడం, ఆపై ఎత్తివేయడం తెలిసిందే. అయితే, తనపై నిషేధం ఎత్తి వేసినప్పటికీ రైల్లోనే ఆయన ప్రయాణం చేస్తున్నారు. నిన్న ఉదయం పుణె నుంచి విమానంలో ఢిల్లీకి ఆయన బయలుదేరి వెళ్లాల్సి ఉంది. కానీ, పుణె నుంచి రాజధాని ఎక్స్ ప్రెస్ లో ఆదివారం నాడే ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈ విషయమై గైక్వాడ్ మాట్లాడుతూ, ‘నేను సామాన్య పౌరుడిని. అందుకే, రాజధాని ఎక్స్ ప్రెస్ లో ఢిల్లీ వచ్చాను. రేపు కూడా రాజధాని ఎక్స్ ప్రెస్ రైలులోనే ముంబయికి తిరిగి వెళ్తాను’ అని చెప్పారు. కాగా, ఎయిర్ ఇండియా సిబ్బందిపై చేయి చేసుకున్న ఘటన అనంతరం, తాను వీవీఐపీని అని చెప్పిన గైక్వాడ్, ఇప్పుడు మాత్రం తాను సామాన్యపౌరుడినని వ్యాఖ్యానించడం గమనార్హం.
 
 

  • Loading...

More Telugu News