: కొత్త చిక్కులో పడిన సిద్ధూ!
భారత మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ మరో వివాదంలో చిక్కుకున్నారు. రాష్ట్ర మంత్రిగా ఉంటూ టీవీ షోలలో ఎలా పాల్గొంటారంటూ ఆయనపై పలువురు విమర్శలు ఎక్కుపెట్టారు. అయినప్పటికీ ఆయన టీవీ షోలో పాల్గొనేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పుడు తాజాగా ఆయనపై ఓ న్యాయవాది కోర్టులో కేసు వేశారు. ది కపిల్ శర్మ షోలో ద్వంద్వార్థాలు వచ్చేలా సిద్ధూ అసభ్యకరమైన పదజాలం ఉపయోగిస్తున్నారంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. కుటుంబ సభ్యులతో కలసి షో చూడాలంటేనే ఇబ్బందిగా ఉందని చెప్పారు.
ఈ నేపథ్యంలో కేసును విచారించిన కోర్టు... బాధ్యత గల మంత్రిగా సర్వీస్ రూల్స్ పాటించకపోతే ఎలాగంటూ ప్రశ్నించింది. తదుపరి విచారణను మే 11వ తేదీకి వాయిదా వేసింది.