: విలేకరుల వైపునకు ఉమ్మేసినందుకు క్షమాపణలు చెప్పిన విజయ్‌కాంత్
డిసెంబర్ 2015లో తాను విలేకరులతో ప్రవర్తించిన తీరు పట్ల డీఎండీకే అధ్యక్షుడు విజయ్‌కాంత్ ఇప్పుడు క్షమాపణలు చెప్పారు. ఆ సమయంలో మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తోన్న ఆయన... విలేకరులు అడిగిన పలు ప్రశ్నల పట్ల అసహనం వ్యక్తం చేస్తూ, కోపంతో రిపోర్టర్ల దిశగా ఉమ్మేశాడు. ఆ ఘటనపై తాజాగా విజయ్‌కాంత్ తరఫున క్షమాపణ కోరుతున్నట్లు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కమిటీకి ఆయన లాయర్ చెప్పారు. తన క్షమాపణ ప్రకటనను పీసీఐ రికార్డు చేసుకొని ఆ కేసును కొట్టివేసిందని విజయ్‌కాంత్ లాయర్ జీఎస్ మణి తెలిపారు.