: అలాంటప్పుడు ఎక్కువ పారితోషికం అడుగుతా: సింగర్ ప్రణవి


తాను పాడిన పాటకు వేరే సింగర్ పేరు వేస్తామని నిర్మాత లేదా సంగీత దర్శకుడు చెబితే ఆ పాటకు పారితోషికం ఎక్కువ అడుగుతానని సింగర్ ప్రణవి తెలిపింది. ఓ ఇంటర్వ్యూలో సినిమా పాటలకు సంబంధించిన పలు సంచలన విషయాలు వెల్లడించిన ప్రణవి మాట్లాడుతూ, కోట్లు పెట్టి సినిమాలు తీసే నిర్మాతలు పాటలు ఉచితంగా పాడించుకోవాలని చూస్తారని తెలిపింది. ఒక్కోసారి తక్కువ డబ్బులు ఇస్తారని కూడా చెప్పింది.

సినిమాల్లో పాడితే చాలా తక్కువ డబ్బులు ఇస్తారని, అదే స్టేజ్ షోలలో పాడితే ఎక్కువ డబ్బులు వస్తాయని తెలిపింది. సినిమాల్లో పాడిన వారికే స్టేజ్ షోలలో అవకాశం ఇస్తారని చెప్పింది. అందుకే సినిమాల్లో పాడేటప్పుడు ఎంత ఇచ్చినా సింగర్స్ ఒప్పుకుంటారని తెలిపింది. ఒకసారి తాను పాడిన పాటకు శ్రేయ ఘోషల్ పేరు వేశారని, తన అనుమతి తీసుకునే అలా వేశారని చెప్పింది. అలాంటప్పుడు ఎక్కువ డబ్బులు అడుగుతానని స్పష్టం చేసింది. 

  • Loading...

More Telugu News