: కష్ట కాలంలో పార్టీని ఆదుకున్నది బీసీలే!: చంద్రబాబునాయుడు
కష్ట కాలంలో పార్టీని ఆదుకున్న వారు బీసీలేనని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖపట్టణంలోని ఆంధ్రా యూనివర్శిటీలో జ్యోతిరావ్ పూలే జయంతి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, సమాజం కోసం జ్యోతిరావు పూలే రాజీ లేని పోరాటం చేశారని, తన జీవితాన్ని ప్రజల కోసం త్యాగం చేసిన మహనీయుడని ప్రశంసించారు. తెలుగుదేశం పార్టీకి బీసీ వర్గాలే వెన్నెముక అని, కోర్టుల చుట్టూ తిరిగే నాయకులను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు, కాల్వ శ్రీనివాసులు, నక్కా ఆనందబాబు పాల్గొన్నారు.