: కూతురికి పెళ్లికానుకగా ఎవ్వరూ ఊహించని బహుమతి ఇచ్చిన ముస్లిం సోదరుడు!
హర్యానాలోని సోనిపట్ జిల్లా ఖార్ ఖొద్దా గ్రామానికి చెందిన ఓ ముస్లిం వ్యక్తి తన కుమార్తె పెళ్లికి ఇచ్చిన ప్రత్యేక కానుక గురించి తెలుసుకున్న వారంతా శభాష్ అంటున్నారు. అటువంటి వ్యక్తులు ఉంటే దేశంలో మతసామరస్యం వెల్లివిరుస్తుందని కొనియాడుతున్నారు. నూర్ ఖాన్ అనే వ్యక్తి తన కూతురికి ఓ గోవును బహూకరించాడు.
దాదాపు రూ.15 వేలతో గోవును కొన్న ఆయన.. తన కూతురి పెళ్లి కాగానే దానిని ఆమెకు ఇచ్చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన కుమార్తెకు ఆవులంటే ఎంతో ఇష్టమని చెప్పాడు. ఆమెకు ఆవులు ఎక్కడ కనబడినా బ్రెడ్డు, బెల్లం పెడుతుంటుందని పేర్కొన్నాడు. తన తండ్రి ఊహించని బహుమతి ఇవ్వడం పట్ల కొత్త పెళ్లి కూతురు హర్షం వ్యక్తం చేసింది.