: గుడ్ న్యూస్.. హైదరాబాదు నుంచి షిరిడీకి విమానంలో వెళ్లిపోవచ్చు!


షిరిడీ సాయిబాబా భక్తులకు శుభవార్త. వచ్చే నెల నుంచి షిరిడీకి విమాన సేవలు ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్, ముంబై, ఢిల్లీలాంటి ప్రధాన నగరాల నుంచి షిరిడీకి విమానాలను నడపనున్నారు. షిరిడీ విమానాశ్రయాన్ని మహారాష్ట్ర ఎయిర్ పోర్ట్ డెవలప్ మెంట్ కంపెనీ లిమిటెడ్ (ఎంఏడీసీ) నిర్వహించనుంది. ప్రస్తుతానికి ఈ విమానాశ్రయానికి దేశీయ విమానాలు మాత్రమే రాకపోకలు సాగిస్తాయి. భవిష్యత్తులో అంతర్జాతీయ విమానాలను కూడా నడిపే అవకాశం ఉందని ఎంఏడీసీ సీఎండీ విశ్వాస్ పాటిల్ తెలిపారు. తొలి విడతలో హైదరాబాద్, ఢిల్లీ, ముంబైలకు విమానాలను నడుపుతామని చెప్పారు.

  • Loading...

More Telugu News