: 10 రోజుల్లోనే రూ.150 కోట్ల విలువైన జియోనీ ఏ1 స్మార్ట్ ఫోన్ల బుకింగ్స్


జియోనీ తాజాగా విడుద‌ల చేసిన‌ స్మార్ట్ ఫోన్ ఏ1కు మంచి స్పంద‌న వ‌స్తోంది. రిజిస్ట్రేషన్లు ప్రారంభమైన 10 రోజుల్లోనే రూ.150 కోట్ల విలువైన జియోనీ ఏ1 స్మార్ట్ ఫోన్లు బుక్ అయ్యాయి. త‌మ స్మార్ట్‌ఫోన్‌కు వ‌స్తోన్న ఆద‌ర‌ణ ప‌ట్ల ఆ కంపెనీ ప్ర‌తినిధులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. తాము ప‌ది రోజుల్లోనే మొత్తం 74,682 యూనిట్ల ప్రీఆర్డర్లను స్వీకరించినట్టు తెలిపింది. జియోనీ విడుద‌ల చేసిన ఏ1,  ఏ1 ప్లస్ స్మార్ట్‌ఫోన్ ధ‌ర‌ రూ.19,999 గా ఉంది. గ‌త నెల 31 నుంచి ఈ స్మార్ట్ ఫోన్ ప్రీ-బుకింగ్స్  ప్రారంభమ‌య్యాయి. బిగ్ బ్యాటరీ, సెల్ఫీ ఫోకస్డ్ పీఛ‌ర్స్‌తో ఈ ఫోన్ ఆక‌ట్టుకుంటోంది. ఈ స్మార్ట్‌ఫోన్ సామర్థ్యం  4010 ఎంఏహెచ్‌. ఈ స్మార్ట్‌ఫోన్ కోసం ఎక్కువ బుకింగ్‌లు ఆఫ్ లైన్ క‌స్ట‌మ‌ర్ల నుంచే వ‌స్తున్నాయ‌ని జియోనీ కంపెనీ తెలిపింది. త‌మ క‌స్ట‌మ‌ర్ల ముందు 42 వేల రిటైల్ అవుట్ లెట్లు, 555 ఎక్స్ క్లూజివ్ స‌ర్వీస్ సెంటర్ల‌ను అందుబాటులో ఉంచుతున్న‌ట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News