: ఈ మ‌ర‌ణ‌శిక్ష‌ ఓ హెచ్చరిక లాంటిది... జాగ్రత్త!: కుల్ భూషణ్ కు మరణశిక్షపై భారత్ తీరుపై పాకిస్థాన్


భారతీయ నేవీ మాజీ అధికారి కుల్ భూషణ్‌ జాధవ్‌కు పాకిస్థాన్‌ ఆర్మీ కోర్టు ఉరిశిక్ష విధించిన అంశంపై భారత్ నుంచి వ్యతిరేకత వస్తోన్న విషయం తెలిసిందే. అయితే, ఈ అంశంపై పాకిస్థాన్‌ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ స్పందిస్తూ త‌మ చ‌ర్యను వెన‌కేసుకొచ్చారు. తమ దేశానికి వ్యతిరేకంగా కుట్ర చేసిన వారికి ఈ మ‌ర‌ణ‌శిక్ష‌ హెచ్చరిక లాంటిందని, పాక్‌ సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా వ్యవహరించేవారిని వదిలిపెట్టబోమని ఆయ‌న హెచ్చ‌రించారు.

అటువంటి వారికి వ్యతిరేకంగా రాజ్యాంగబద్ధమైన శక్తులన్నింటినీ వాడుకుంటామని పేర్కొన్నారు. త‌మ దేశ ప్ర‌జ‌లు, సైనికులు పాక్‌ కోసం ఎన్నో త్యాగాలు చేశారని ఆయ‌న వ్యాఖ్యానించారు. వారు చేసిన త్యాగాలు ఉగ్రవాదులతో పాటు వారికి సాయం చేసేవారికి తగిన బుద్ధి చెప్పాలని కోరుతున్నాయని అన్నారు. అంతేగాక‌, మ‌ర‌ణ‌శిక్ష ప‌డ్డ‌ కుల్ ‌భూష‌ణ్ తాను చేసిన నేరాన్ని బహిరంగంగా ఒప్పుకొన్నాడని ఆయ‌న అన్నారు. ఈ విషయాన్ని భారత్‌ లేవనెత్తితే మాత్రం త‌మ దేశం తగిన సమాధానం ఇస్తుందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News