: పాకిస్థాన్ నాటకాలు ఆడుతోంది: అసదుద్దీన్ ఒవైసీ
పాకిస్థాన్ సైనిక కోర్టు మరణశిక్షను విధించిన భారత నేవీ మాజీ అధికారి కులభూషణ్ యాదవ్ ను కేంద్ర ప్రభుత్వం కాపాడాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ విన్నవించారు. లోక్ సభలో ఆయన మాట్లాడుతూ ఈ మేరకు కోరారు. కులభూషణ్ యాదవ్ అంశం ఈ రోజు పార్లమెంటును కుదిపేసింది. విపక్షాలన్నీ ఈ అంశంపై ఏకమయ్యాయి. ఈ సందర్భంగా ఒవైసీ మాట్లాడుతూ, భారత్ ను ఎదుర్కోలేకే పాకిస్థాన్ ఇలాంటి నాటకాలు ఆడుతోందని విమర్శించారు. జాదవ్ ను కాపాడటానికి అవసరమైతే అంతర్జాతీయంగా మద్దతును కూడగట్టాలని సూచించారు.