: 57 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టేశారు!


ఆఫ్రికా దేశమైన నైగర్ లో బోకోహరమ్ ఉగ్రవాదులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నిన్న డిఫా ప్రాంతంలోని గుయెస్కెరో గ్రామంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ నేపథ్యంలో, నైగర్ సైన్యం వారిపై విరుచుకుపడింది. ఏకంగా 57 మంది ముష్కరులను మట్టుబెట్టింది. ఇదే ఘటనలో 15 మంది సైనికులతో పాటు, ఇద్దరు పౌరులకు గాయాలయ్యాయి. ఉగ్రవాదుల నుంచి భారీ సంఖ్యలో ఏకే47 తుపాకులు, రాకెట్ లాంచర్ లను సైన్యం స్వాధీనం చేసుకుంది. ఈ వివరాలను నైగర్ డిఫెన్స్ మినిస్ట్రీ వెల్లడించింది.

  • Loading...

More Telugu News