: అమెరికాలోని ఎలిమెంటరీ స్కూల్లో గర్జించిన తుపాకి.. టీచర్, విద్యార్థి మృతి


అమెరికాలో తుపాకి మరోమారు గర్జించింది. కాలిఫోర్నియాలోని శాన్‌బెర్నార్డినో ఎలిమెంటరీ స్కూల్‌లో జరిగిన కాల్పుల్లో టీచర్, ఓ విద్యార్థి మృతి చెందారు. భార్య నుంచి విడిపోయిన భర్త తుపాకితో స్కూల్లోకి ప్రవేశించి, వచ్చీ రావడంతోనే కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో హంతకుడి భార్య (టీచర్), 8 ఏళ్ల విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందారు. 9 ఏళ్ల విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం దుండగుడు తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో ఆ ప్రాంతం భయంతో వణికిపోయింది. కాల్పులు జరిపిన వ్యక్తిని ఎలైన్ స్మిత్ (53)గా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. వీరిద్దరికి కొన్ని నెలల క్రితమే వివాహమైందని పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

  • Loading...

More Telugu News