: ఒత్తిడికి గురైన మద్యం కంపెనీల షేర్లు.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ఈ రోజు స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 130.87 పాయింట్లు నష్టపోయి 29,575 వద్ద ముగిస్తే, నిఫ్టీ 16 పాయింట్లు పడిపోయి 9181 వద్ద ముగిసింది. మార్కెట్లోని 1764 షేర్లు లాభాల్లో పయనించగా, 1163 షేర్లు నష్టాలు చవిచూశాయి. మరో 128 షేర్ల ధరల్లో మార్పులేదు. మధ్యప్రదేశ్లో విడతల వారీగా మద్యం దుకాణాలను మూసివేస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రకటన రావడంతో మద్యం కంపెనీల షేర్లు ఒత్తిడికి గురై ఆ ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడింది. యునైటెడ్ స్పిరిట్స్ 6.59 శాతం విలువ కోల్పోయింది.
ఈ రోజు లాభపడ్డ షేర్లు...
బీపీసీఎల్, గ్రాసిమ్, యస్ బ్యాంక్, భారతీ ఇన్ఫాటెల్, టాటామోటార్స్(డి)
నష్టపోయిన షేర్లు ...
ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, హెచ్సీఎల్ టెక్, రిలయన్స్, విప్రో.