: 5జీ కోసం చేతులు కలిపిన ఎయిర్‌టెల్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌, నోకియా


భార‌త్‌లో 5జీ సేవ‌ల‌ను అందించ‌డ‌మే ల‌క్ష్యంగా ఎయిర్‌టెల్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌, నోకియాలు చేతులు కలిపాయి. ఈ అంశంపై ఇటీవ‌లే నోకియా ప్ర‌తినిధులు మాట్లాడుతూ... 5జీ సేవలను ప్రారంభించడమే తమ టార్గెట‌ని తెలిపారు. తాజాగా ఇందుకు సంబంధించి ఈ మూడు కంపెనీలు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. దీంతో దేశంలో అత్యధిక వేగంతో వైర్‌లెస్‌ బ్రాడ్‌బాండ్ స‌ర్వీసుని అందించే క్ర‌మంలో ప్ర‌య‌త్నాలు జ‌ర‌గ‌నున్నాయి.

ఈ ఒప్పందం ప్ర‌ధానంగా ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, స్మార్ట్‌ సిటీ, డిజిటల్ ఇండియాలకు మ‌రింత ఉప‌యోగ‌క‌రం. 5జీ ఎకో సిస్టమ్‌ను అభివృద్ధి చేయడానికి బీఎస్‌ఎన్‌ఎల్‌తో కలిసి పనిచేయ‌నున్న‌ట్లు నోకియా ప్ర‌తినిధులు చెప్పారు. ఈ మేరకు ఇరు కంపెనీలు దేశ‌వ్యాప్తంగా ప్రదర్శనలు కూడా ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు. ఈ మూడు సంస్థ‌లు ప్ర‌స్తుతం 4జీ సేవ‌ల‌ను అందిస్తున్నాయి. త‌మ నెట్‌వర్క్‌ను 5జీతో అప్‌గ్రేడ్‌ చేయడం ద్వారా నాణ్యమైన సేవలను అందించాలని చూస్తున్నాయి.

  • Loading...

More Telugu News