: అమెరికాపై ఏ క్షణంలోనైనా ఉత్తరకొరియా అణ్వస్త్ర దాడి జరపవచ్చు: రష్యా హెచ్చరిక
అమెరికాపై ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ ఏ క్షణంలోనైనా దాడి చేసే అవకాశం ఉందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను రష్యా హెచ్చరించింది. దక్షిణకొరియాకు భారీ ఎత్తున ఆయుధాలను, సైన్యాన్ని తరలించడం మంచిది కాదని... ఈ తరహా చర్యలతో కిమ్ జాంగ్ ను రెచ్చగొట్టినట్టు అవుతుందని చెప్పింది. ఈ మేరకు అమెరికాకు రష్యా డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ ఛైర్మన్ విక్టర్ ఓజెరోవ్ పలు సూచనలు చేశారు. కిమ్ జాంగ్ ను రెచ్చగొట్టే విధంగా అమెరికా ఎలాంటి ప్రయత్నం చేసినా... ఇరు దేశాల మధ్య భీతావహ వాతావరణం నెలకొంటుందని హెచ్చరించారు. తమ వద్ద ఉన్న సమాచారం ప్రకారం... అమెరికాపై కిమ్ జాంగ్ ఏ క్షణంలోనైనా అణ్వస్త్ర దాడి జరిపే అవకాశం ఉందని చెప్పారు.