: హైదరాబాద్ పాతబస్తీ లో దారుణం .. ‘టిప్’ కోసం సర్వర్ల మధ్య ఘర్షణ.. ఒకరి మృతి!


హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. ఓ కస్టమర్ ఇచ్చిన ‘టిప్’ కోసం ఇద్దరు సర్వర్లు ఘర్షణ పడి, పరస్పరం దాడికి దిగారు. ఈ ఘటనలో ఓ సర్వరు అక్కడికక్కడే మృతి చెందాడు. కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని స్పైస్ బావర్చి హోటల్ లో రాజ్, కమ్లేజ్ లు సర్వర్లుగా పని చేస్తున్నారు. హోటల్ కు వచ్చిన ఓ కస్టమర్ రూ.30 టిప్ గా ఇచ్చాడు. దీంతో, ఆ ‘టిప్’ కోసం వాళ్లిద్దరూ పరస్పరం గొడవకు దిగారు.

ఈ క్రమంలో సర్వరు రాజు ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటనపై హోటల్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడిని అరెస్టు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ సమాచారాన్ని మృతుడి కుటుంబసభ్యులకు పోలీసులు తెలియజేశారు. కాగా, ఆ హోటల్ లో పనిచేస్తున్న రాజు, కమ్లేజ్ లిద్దరూ ఉత్తరప్రదేశ్ కు చెందిన వారని హోటల్ యజమాని తెలిపాడు.

  • Loading...

More Telugu News