: రంభ సమస్య తీరిపోయింది... భర్తతో కలసి తిరుమల వచ్చింది!


తన భర్త తనతో కలసి ఉండేలా చూడాలంటూ మద్రాస్ హైకోర్టులో ప్రముఖ సినీ నటి రంభ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రంభతో కలసి జీవించేందుకు ఆమె భర్త అంగీకరించాడు. వాస్తవానికి వీరిద్దరూ విడాకులు తీసుకోవాలనుకున్నారు. ఆ తర్వాత, కోర్టు సూచనతో మనసు మార్చుకుని మళ్లీ కలసిపోయారు. ఈరోజు వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని రంభ, ఆమె భర్త కలసి దర్శించుకున్నారు. తమ ఇద్దరు కుమార్తెలతో కలసి వారు తిరుమల వచ్చారు. శ్రీవేంకటేశ్వరుడిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా రంభను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. 

  • Loading...

More Telugu News