: భువనగిరి, ఆలేరు, జనగామలో నిలిచిపోయిన రైళ్లు!


పగిడిపల్లి వద్ద ముంబయి-ఎల్ టీటీ ఎక్స్ ప్రెస్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో నిలిచిపోయింది. ఈ ప్రభావం ఆ మార్గంలో నడిచే మిగిలిన రైళ్లపై కూడా పడింది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి రైల్వేస్టేషన్ లో రాజధాని, గోల్కోండ ఎక్స్ ప్రెస్ లతో  పాటు మరో రైలు నిలిచిపోయింది. అంతేకాకుండా, ఆలేరు, జనగామలో మరో మూడు రైళ్లు నిలిచిపోయాయి. సుమారు రెండు గంటలుగా రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఈ నేపథ్యంలో భువనగిరి స్టేషన్ మాస్టర్ వద్ద ప్రయాణికులు తమ నిరసన తెలిపారు.

  • Loading...

More Telugu News