: బాలీవుడ్ నటి అనుష్క శర్మపై ఫిర్యాదు... వివరణ ఇవ్వమన్న బీఎంసీ!
బాలీవుడ్ నటి అనుష్క శర్మకు ముంబయిలోని వర్సోవా ప్రాంతంలో బద్రీనాథ్ టవర్‌లోని 20వ అంతస్తులో మూడు ప్లాట్లు ఉన్నాయి. అక్కడే నివసిస్తోన్న ఆమె.. 20వ అంతస్తులో ఎవరి అనుమతి లేకుండా ఎలక్ట్రిక్ జంక్షన్ బాక్స్ పెట్టించుకుంది. దీంతో అదే టవర్‌లో ఉంటున్న సునిల్ బాత్రా అనే వ్యక్తి ఈ విషయంపై ఫిర్యాదు చేయడంతో అనుష్కశర్మకు బీఎంసీ నోటీసులు పంపించింది. వెంటనే జంక్షన్ బాక్సును తొలగించి వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
అయితే, తాను అన్ని అనుమతులు తీసుకున్నాకే ఎలక్ట్రిక్ జంక్షన్ బాక్సును ఏర్పాటు చేసినట్లు ఆమె మేనేజర్ అంటున్నారు. ఈ విషయంపై ఫిర్యాదు చేసిన వ్యక్తి గతంలో ఆ టవర్స్‌కు కార్యదర్శిగా వ్యవహరించేవాడని కొందరు అంటున్నారు. అయితే, ఆ పదవి నుంచి అతడిని తొలగించడంతో అనుష్క కుటుంబీకులపై ఆయన ఆగ్రహంతో ఉన్నాడని చెబుతున్నారు.