: శంషాబాద్ ఎయిర్ పోర్టు వద్ద కొట్టుకున్న క్యాబ్ డ్రైవర్లు
హైదరాబాదులోని శంషాబాద్ ఎయిర్ పోర్టు వద్ద క్యాబ్ డ్రైవర్ల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాలుగా విడిపోయిన క్యాబ్ డ్రైవర్లు పరస్పరం దాడులు చేసుకుని, కొట్టుకున్నారు. అనంతరం ఇరు వర్గాలు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాయి. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. పార్కింగ్ కు సంబంధించిన అంశమే ఘర్షణకు కారణంగా భావిస్తున్నారు.