: డబ్బు కోసం ప్రతి అవకాశాన్ని ఒప్పుకోను: హీరోయిన్ ప్రణీత


బెంగళూరు భామ ప్రణీత ప్రస్తుతం కన్నడ, తమిళ సినిమాలతో బిజీగా వుంది. ఆమె నటించిన 'లీడర్' కన్నడ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉండగా... తమిళంలో 'జెమిని గణేశనం సురులి రాజను' షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, తాను నటించే సినిమాలో ఎంతమంది ఉన్నప్పటికీ... తన పాత్ర ప్రాధాన్యత ఏమిటనేదే తనకు ముఖ్యమని చెప్పింది. డబ్బు కోసం అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఒప్పుకోనని తెలిపింది. పని విషయాన్ని పక్కాగా ప్లాన్ చేసుకుంటానని చెప్పింది. వ్యక్తిగత జీవితానికి కూడా సమయాన్ని కేటాయించుకుంటానని తెలిపింది. 

  • Loading...

More Telugu News