: నా ఫేవరేట్ దర్శకుడు రాజమౌళి కాదు... అనుష్క చెప్పిందే కరెక్టు!: ప్రభాస్


తన ఫేవరేట్ దర్శకుడు రాజమౌళి కాదని ‘బాహుబలి’ ప్రభాస్ తెలిపాడు. చెన్నలో జరిగిన ‘బాహుబలి’ ఆడియో వేడుకలో ప్రభాస్ మాట్లాడుతూ, రాజమౌళి తనకు ఇష్టమైన దర్శకుడే కానీ... తన ఫేవరేట్ దర్శకులు మాత్రం మణిరత్నం, బాపు అని చెప్పాడు. అలా కాకుండా కేవలం ఒక్క దర్శకుడి పేరే చెప్పాలంటే మాత్రం మణిరత్నమే తన ఫేవరేట్ దర్శకుడని అన్నాడు. ఈ విషయం రాజమౌళికి కూడా తెలుసని ప్రభాస్ చెప్పాడు. తరువాత అనుష్క మాట్లాడుతూ, ‘బాహుబలి’ సినిమా పూర్తయ్యేంతవరకు పెళ్లికి దూరంగా ఉండాలని ప్రభాస్ నియమం ఏమీ పెట్టుకోలేదని చెప్పింది. ఆ విషయంలో వచ్చిన వార్తలన్నీ పుకార్లేనని స్పష్టం చేసింది. దీంతో అనుష్క చెప్పింది నిజమేనని ప్రభాస్ తెలిపాడు.

  • Loading...

More Telugu News