: ఇండియన్ వి మా దేశం విడిచి వెళ్లిపో... అమెరికాలో బుసలు కొడుతున్న జాత్యహంకారం
అమెరికాలో జాత్యహంకారం బుసలుకొడుతోంది. మంచిర్యాలకు చెందిన సాయి వరుణ్ అనే యువకుడు క్లింటన్ నగరంలో విద్యనభ్యసిస్తున్నాడు. పార్ట్ టైమ్ గా షెల్ గ్యాస్ స్టేషన్ లో పని చేస్తున్నాడు. విధులకు హాజరైన సాయి వరుణ్ మంచిర్యాలలో ఉన్న తల్లితో వీడియో కాల్ మాట్లాడుతుండగా, గ్యాస్ స్టేషన్ లో ఓ ముసుగు దొంగ ప్రవేశించాడు. వరుణ్ కు రివాల్వర్ గురిపెట్టి, క్యాష్ కౌంటర్ ను దోచుకున్నాడు.
కౌంటర్లలోని డబ్బు జేబులో వేసుకున్న అనంతరం ‘‘భారతీయుడివి ఇక్కడెందుకున్నావు? మీ దేశానికి తిరిగి వెళ్లు’’ అని బెదిరిస్తూ వెళ్లిపోయాడు. ఈ క్రమంలో ఒక వ్యక్తి దుకాణంలో వస్తువులు కొనుగోలు చేసేందుకు వచ్చి, డోర్ అద్దాల నుంచి చూసి, అట్నుంచి అటే పారిపోయాడు. ఇదంతా సీసీ కెమెరాలో నమోదైంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.