: చిన్నప్పుడు సత్య నాదెళ్ల ఏం కావాలనుకున్నారో తెలుసా?
మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, తెలుగు ప్రజలకు గర్వకారణమైన సత్య నాదెళ్ల చిన్నపుడు ఏమవ్వాని కలలు కనేవారో తెలుసా? సగటు భారతీయుడిలా క్రికెటర్ అవ్వాలని ఆయన కలలు కనేవారట. హైదరాబాదులోని బేగంపేటలో గల ‘హైదరాబాద్ పబ్లిక్ స్కూల్’లో విద్యాభ్యాసం పూర్తి చేసిన సత్య నాదెళ్ల... స్కూల్ డేస్ లో రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్.
‘స్కూల్, జూనియర్ స్థాయి వరకు ఆయన క్రికెట్ ఆడారు. ఆ తరువాత క్రికెట్ అంటే మక్కువ ఉన్నప్పటికీ ఆటపై పూర్తిగా మనసు పెట్టలేకపోయారు. సరిగ్గా ఆ సమయంలోనే ఆయనకు ‘ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ’ రంగంపైన ఆసక్తి కలిగింది. దీంతో ఆయన ఆ దిశగా సాగిపోయారు. ఇప్పుడు ప్రపంచంలోనే పేరెన్నికగన్న మైక్రోసాఫ్ట్ సీఈవోగా విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా, క్రికెట్ తనకు బృందం (టీమ్) తో కలిసి ఎలా పనిచేయాలో, నాయకుడు ఎలా ఉండాలో నేర్పిందని ఆయన చెబుతారు. ఆయనకు ఇప్పటికీ టెస్టు క్రికెట్ అంటే ఇష్టం. ఎప్పటికప్పుడు యాప్స్ లో మ్యాచ్ ల అప్ డేట్స్ చూసుకుంటారు.