: కేరళ సీఎం నివాసానికి సమీపంలో దారుణం.. మృతదేహాల కలకలం!


కేరళ సీఎం పినరయి విజయన్ నివాసానికి సమీపంలోని ఇంటిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతదేహాలు పడి ఉండటం కలకలం రేపాయి. సీఎం నివాసానికి సమీపంలో ఉన్న ఓ ఇంట్లో నుంచి పొగలు వ్యాపిస్తుండటంతో పోలీసులకు స్థానికులు సమాచారం అందజేశారు. దీంతో, సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు ఆ ఇంట్లో నాలుగు మృతదేహాలు కనిపించాయి. మూడు మృతదేహాలను కాల్చేసి, మరో మృతదేహాన్ని ముక్కలుగా నరికేశారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను తరలించారు.నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, ఈ సంఘటన నేపథ్యంలో సీఎం నివాసం వద్ద  భద్రత పెంచారు. 

  • Loading...

More Telugu News