: నేను ఎవరిపైనా దాడి చేయలేదు: బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్


తాను ఎవరిపైనా దాడి చేయలేదని, ఇందుకు సంబంధించి వస్తున్న వార్తలు అబద్ధమని బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ స్పష్టం చేశాడు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశాడు. అసలు, ఈ ట్వీట్ చేయడానికి గల కారణమేంటంటే.. ఈ రోజు తెల్లవారుజామున ముంబైలోని షాంగ్రీ-లా హోటల్ నైట్ క్లబ్ లో అర్జున్ రాంపాల్  డీజేగా వ్యవహరించాడు. ఆ సమయంలో రాంపాల్ ఫొటోలు తీసేందుకు ఓ ఫొటో గ్రాఫర్ యత్నించాడు. రాంపాల్ వద్దని ఎంతగా వారించినా సదరు ఫొటోగ్రాఫర్ వినలేదు.

దీంతో, ఆగ్రహించిన రాంపాల్, అతని చేతిలో నుంచి కెమెరాను లాక్కుని విసిరేశాడు. ఆ కెమెరాను క్లబ్ లోని వారు ఎవరో ఒకరు క్యాచ్ పట్టుకుంటారని రాంపాల్ అనుకున్నాడు. కానీ, అలా జరగలేదు. దీంతో, ఆ కెమెరా వెళ్లి షాబిత్ అనే వ్యక్తికి తగలడంతో, అతని తలకు గాయమైంది. దీంతో, అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నైట్ క్లబ్ లోని సీసీ టీవీ కెమెరాను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాంపాల్ ను విమర్శిస్తూ నెటిజన్లు మెసేజ్ లు, మీడియాలో వార్తలు హల్ చల్ చేయడం జరిగింది. అర్జున్ రాంపాల్ తనపై దాడి చేశాడంటూ షాబిత్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

  • Loading...

More Telugu News